vijay devarakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాలోంచి 'ఫస్ట్‌గేర్‌' వీడియో

  • రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘ట్యాక్సీవాలా’
  • హీరోయిన్లుగా ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ 
  • త్వరలో టీజర్‌ కూడా విడుదల

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘ట్యాక్సీవాలా’ నుంచి ఓ వీడియో విడుదలైంది.

‘ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌’ పేరుతో యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్  తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి. ట్యాక్సీని వేగంగా నడుపుతూ, కారుపై ఉన్న దుమ్మును దులిపేస్తున్నట్లు ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సాహసాన్ని చూపించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది.  

More Telugu News