France: ఫ్రాన్స్‌లో కలకలం.. సూపర్‌ మార్కెట్‌లో కాల్పులు.. ఐఎస్ ఉగ్రవాదిగా అనుమానం!

  • దుండగుడిని ఐఎస్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తోన్న పోలీసులు
  • బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు యత్నం
  • ఓ పోలీసుకి గాయాలు

ఫ్రాన్స్‌లో కలకలం చెలరేగుతోంది. కార్కాసన్ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీసుకి గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్‌లోని పలువురిని బందీలుగా తీసుకుని బెదిరిస్తున్నాడు. ఆ దుండగుడు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఓ తుపాకీతో ఆ దుండగుడు ఇప్పటికి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడని అక్కడి అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆ దుండగుడి చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.  

More Telugu News