junior ntr: ఆ ఫొటోలో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కాదు : పర్సనల్ ట్రైనర్ లాయిడ్స్

  • ఇది ఎవరో సృష్టించిన నకిలీ చిత్రం
  • వారి సృజనాత్మకతకు హ్యాట్సాప్
  • ఓ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్స్

త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం కోసం యంగ్ టైగర్ జిమ్ లో కసరత్తు చేస్తుండగా తీసిన ఒక ఫొటోను పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటోను చూసిన యంగ్ టైగర్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. అయితే, జిమ్ లో జూనియర్ ఎన్టీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా ఉన్న మరో ఫొటో ఒకటి కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది.

కానీ, ఆ ఫొటో జూనియర్ ఎన్టీఆర్ ది కాదని, ‘ఫేక్’ అని పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘దయచేసి గుర్తుంచుకోండి.. ఇది ఎవరో సృష్టించిన నకిలీ చిత్రం. అయితే, వారి సృజనాత్మకతకు హ్యాట్సాప్..’ అని అన్నారు.

More Telugu News