stock markets: ట్రంప్ దెబ్బకు భారీగా పతనమైన మార్కెట్లు!

  • చైనా దిగుమతులపై ట్రంప్ ఆంక్షలు
  • వాణిజ్య యుద్ధానికి దారి తీయవచ్చనే భయాందోళనలలో ఇన్వెస్టర్లు
  • 410 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ఇది దారి తీయవచ్చని భయపడుతున్నారు. దీని ప్రభావంతో అమెరికా, ఐరోపా మార్కెట్లు డీలాపడ్డాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 32,597కు పడిపోయింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 9,998కి దిగజారింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (5.02%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (4.98%), డిష్ టీవీ (4.25%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (3.39%), సద్భావ్ ఇంజినీరింగ్ (2.38%).

టాప్ లూజర్స్:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-8.29%), సిండికేట్ బ్యాంక్ (-7.40%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-7.15%), సెయిల్ (-6.58%), జై కార్పొరేషన్ (-6.49%).  

More Telugu News