Andhra Pradesh: ఏపీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారు: యనమల

  • పోలవరానికి రూ.1400 కోట్లు ప్రకటించి రూ.300 కోట్ల కోత విధించారు
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది
  • ఏ1, ఏ2లు సీఎంకు సభాహక్కుల నోటీసు ఇస్తామనడం హాస్యాస్పదం
  • బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల మహా కుట్ర ప్రజలకు అర్థమవుతోంది

ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధుల్లో కేంద్ర మంత్రులు కోతలు విధిస్తున్నారని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో  పోలవరం ప్రాజెక్టుకి రూ.1400 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... అందులో రూ.300 కోట్ల కోత విధించిందని తెలిపారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అన్నారు. ఏ1, ఏ2లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సభాహక్కుల నోటీసు ఇస్తామనడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ పక్క అవిశ్వాస తీర్మానం పెడుతూ మరోపక్క విజయసాయిరెడ్డి పీఎంవోలో ఉండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఏపీలో మహా కుట్ర పన్నుతున్నాయని, ఆ విషయం ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.    

More Telugu News