మరోసారి లోక్ పాల్ కోసం కదిలిన అన్నాహజారే... ఢిల్లీలో మొదలైన నిరాహార దీక్ష
- కేంద్రం తీరుపై విమర్శలు
- లోక్ పాల్ తో 80 శాతం అవినీతి తగ్గుతుంది
- అవినీతి అంతం కావాలని రాజకీయ నేతలు కోరుకోవడం లేదు
- లోక్ పాల్ అమలు చేయకపోగా, నిర్వీర్యం చేస్తున్నారన్న హజారే
‘‘ఢిల్లీకి నిరసన కారులను తీసుకొచ్చే రైళ్లను రద్దు చేశారు. వారు హింసకు పాల్పడేలా చేయాలని అనుకుంటున్నారు. నా కోసం పోలీసులను నియమించొద్దని లేఖలు రాసినా గానీ, నియమించారు. మీ రక్షణ నన్ను కాపాడలేదు’’ అని హజారే ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హజారే 2011లోనూ రామ్ లీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అవినీతి కేసులను స్వతంత్రంగా విచారించేందుకు గాను కేంద్రం స్థాయిలో లోక్ పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటుకు హజారే డిమాండ్ చేస్తున్నారు.