Rajya Sabha: తెలంగాణలో కొనసాగుతున్న రాజ్యసభ పోలింగ్.. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం!

  • మూడు స్థానాలకు జరుగుతున్న పోలింగ్
  • టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు
  • సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు గాను ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మొత్తం మూడు స్థానాలకు గాను టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. అయితే, మూడు స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ కు 80 మంది సభ్యుల బలం ఉంది. ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోంది. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. దీంతో, మూడు స్థానాలను కైవసం చేసుకునే మెజార్టీ టీఆర్ఎస్ కు లభించినట్టైంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టి, వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.

More Telugu News