Telugudesam: విభజన వల్లే ఏపీ వెలిగిపోతోందని బీజేపీ నేతలు అనడం దారుణం: లోకేష్

  • ట్విట్టర్ మాధ్యమంగా బీజేపీపై నారా లోకేష్ విమర్శలు
  • ప్రజాందోళనను పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది
  • ఏపీ ప్రజలను మోసం చేసిన జాతీయ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వెలిగిపోతోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం బాధాకరమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బీజేపీ తీరుపై ట్విట్టర్ మాధ్యమంగా పలు ట్వీట్ల ద్వారా స్పందించారు. ప్రజాందోళనను పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయిందని ఆయన అన్నారు.

రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరితే ప్రజలను రెచ్చగొట్టి, ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజలను మోసం చేసిన జాతీయ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోగా, దాని బాటలోనే బీజేపీ కూడా నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సమయం కేటాయించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Telugudesam
BJP
Andhra Pradesh
Nara Lokesh

More Telugu News