BJP: మహమ్మద్ షమీపై వచ్చిన మ్యాక్స్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వాస్తవం కాదని తేల్చిన బీసీసీఐ

  • షమీ మ్యాక్స్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్
  • షమీకి బీ గ్రేడ్ వార్షిక ఒప్పందం కొనసాగింపు
  • తన భార్య హసీన్ చేసిన ఆరోపణల కారణంగా షమీకి కష్టాలు
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై మ్యాచ్ ఫికింగ్స్ ఆరోపణలు నిజం కాదని బీసీసీఐ తేల్చింది. దీంతో ఆయనకు బీ గ్రేడ్ వార్షిక ఒప్పందం కొనసాగించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్ నీరజ్ కుమార్ తెలిపారు. గత కొంత కాలంగా షమీని కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆయన భార్య హసీన్ జహాన్ ఆయనపై వరుసగా ఆరోపణలు చేస్తోంది.

తనను షమీ వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. దీంతో షమీని బీసీసీఐ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం ప్రశ్నించి, ఈ కేసును దర్యాప్తు చేసింది. చివరకు షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని గుర్తించింది. 
BJP
bcci
shami

More Telugu News