సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారు: పయ్యావుల కేశవ్
- చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది ముంపు మండలాల కోసమే
- రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది చంద్రబాబు వల్లే
- వీర్రాజుకు పయ్యావుల కౌంటర్
సోము వీర్రాజు అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది ముంపు మండలాల కోసమేనని అన్నారు. తాము స్లిప్పుల ద్వారా పంపిన అంశాలనే ఆనాడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో మాట్లాడారని తెలిపారు. ఈ విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని సూచించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ కేంద్రం వల్ల రాలేదని, చంద్రబాబు వల్లే వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, తాను మాట్లాడే ప్రతి సారి అడ్డు తగలడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.