nani: నాని మూవీ ఆడియో ఫంక్షన్ కి ముహూర్తం కుదిరింది

  • నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం'
  • ఈ నెల 31న ఆడియో ఫంక్షన్ 
  • వచ్చేనెల 12వ తేదీన సినిమా రిలీజ్     

క్రితం ఏడాది 'నేను లోకల్' .. నిన్నుకోరి'.. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలతో నాని హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో నాని పల్లెటూరికి చెందిన యువకుడిగాను .. విదేశాల నుంచి వచ్చిన రాక్ స్టార్ గాను కనిపించనున్నాడు. ఈ రెండూ విభిన్నమైన పాత్రలు కావడం, ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం. హిపాప్ తమిళ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.   

More Telugu News