Shami: మరో సంచలన ఆరోపణ చేసిన క్రికెటర్ షమీ భార్య

  • షమీకి లండన్ వ్యాపారి అమ్మాయిలను పరిచయం చేసేవాడు 
  • మంజు మిశ్రా అనే మరో యువతితో కూడా షమీకి ఎఫైర్
  • షమీ భార్య జహాన్ సంచలనం రేపుతున్న తాజా ఆరోపణలు
 తన భర్తపై వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేసింది. లండన్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త తన భర్తకు అమ్మాయిలను పరిచయం చేసేవాడని ఆమె మరో 'ఆరోపణ' బాంబు పేల్చింది. "లండన్‌కి చెందిన మహ్మద్ భాయ్ నా భర్త మహ్మద్ షమీకి అమ్మాయిలను పరిచయం చేసేవారు" అని ఆమె తెలిపింది. మంజు మిశ్రా అనే మరో యువతితో కూడా తన భర్తకు వివాహేతర సంబంధముందని జహాన్ ఆరోపిస్తోంది.

కాగా, మహ్మద్ భాయ్ బలవంతం మేరకు పాకిస్థాన్‌కి చెందిన అలీష్‌బా అనే యువతి నుంచి తన భర్త డబ్బులు తీసుకున్నాడని గతంలోనూ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే షమీతో తనకు సంబంధముందని చెబుతూనే తనపై జహాన్ చేసిన ఈ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాగా, షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆమె గతంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Shami
London
Haseen Jahaan
Afffair

More Telugu News