50 రోజులు పూర్తిచేసుకున్న 'ఛలో' .. రెండోవారం నుంచే లాభాలు

22-03-2018 Thu 14:17
  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య
  • మొదటివారంలోనే వచ్చేసిన పెట్టుబడి
  • దర్శకుడికి భారీ ఆఫర్లు

నాగశౌర్య - రష్మిక మందన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛలో' సినిమా, తాజాగా 45 సెంటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఒక సినిమా ఒక వారం ఆడటమే కష్టంగా వున్న నేటి పరిస్థితుల్లో, ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం నిజంగా విశేషమే. 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 24 కోట్లకి పైగా గ్రాస్ ను .. 12.5 కోట్ల షేర్ ను రాబట్టి ఆశ్చర్యచకితులను చేసింది.

 మొదటివారంలోనే పెట్టుబడిని వెనక్కి తెచ్చేసి .. రెండవ వారం నుంచే లాభాలను తీసుకొస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దర్శకుడు వెంకీ కుడుములకి పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక నాగశౌర్య .. రష్మిక మందనలకు కూడా వరుస అవకాశాలు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.