YSRCP: ఐఎన్ఎస్ అరిహంత్ గురించిన సమాచారాన్ని ఇవ్వలేం: వైఎస్సార్సీపీ ఎంపీతో కేంద్రం

  • 2016లో ఇండియన్ నేవీలో చేరిన ఐఎన్ఎస్ అరిహంత్
  • 2017లో అరిహంత్ లోని ప్రొపల్షన్ కంపార్ట్ మెంట్ లో ప్రమాదం
  • వినియోగంపై లోక్ సభలో ప్రశ్నించిన మిధున్ రెడ్డి
స్వదేశీ పరిజ్ఞానంతో తయారై 2016లో ఇండియన్ నేవీలో చేరిన స్వదేశీ తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ కు సంబంధించిన సమాచారం ఇవ్వలేమని పార్లమెంటుకు రక్షణ శాఖ తెలిపింది. 2017లో ఐఎన్ఎస్ అరిహంత్ లోని ప్రొపల్షన్ కంపార్ట్ మెంట్ లో ప్రమాదం చోటుచేసుకుందని, దీంతో అది రక్షణ అవసరాలకు పనికిరాకుండా పోయిందని, ప్రస్తుతం సముద్ర యానం కూడా చేయడం లేదన్న వార్తా కథనాలపై స్పందించాల్సిందిగా రక్షణ శాఖను వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి లోక్ సభలో కోరారు. దీనిపై స్పందించిన రక్షణ శాఖ జాతి ప్రయోజనాల దృష్ట్యా అరిహంత్ కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
YSRCP
mithun reddy
parliment
Lok Sabha

More Telugu News