Maoists: మావోలకు గట్టిదెబ్బ... రూ. 1.50 కోట్ల రివార్డున్న దేవ్ కుమార్ కన్నుమూత

  • టాప్ నక్సల్ కమాండర్ గా ఉన్న దేవ్ కుమార్
  • ఆయనపై ఎన్నో పోలీసు కేసులు
  • 50 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి
మావోయిస్టులకు గట్టిదెబ్బ తగిలింది. టాప్ నక్సల్ కమాండర్ గా, తలపై రూ. 1.50 కోట్ల రివార్డున్న కీలక నేతగా ఉన్న దేవ్ కుమార్ సింగ్ అలియాస్ అరవింద్ జీ అలియాస్ నిషాంత్ గుండెపోటుతో మృతిచెందాడు. అంతర్ జిల్లా మావో కార్యకలాపాల్లో ఆరితేరిన దేవ్ కుమార్, జార్ఖండ్ పోలీసుల రికార్డుల ప్రకారం, నక్సల్ కార్యక్రమాలకు ప్రధాన వ్యూహకర్త.

దేవ్ కుమార్ ను మట్టుబెట్టాలని కూంబింగ్ దళాలు ఎన్నోమార్లు వలపన్నినా, ఆయన తప్పించుకు తిరుగుతుండేవాడు. పలుమార్లు ప్రాణాపాయం నుంచి బయటపడిన 50 ఏళ్ల దేవ్ కుమార్, జార్ఖండ్ లోని బుధ పహాడ్ అడవుల్లో మరణించాడని సమాచారం. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన సాంకేతిక నిపుణుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు చేసి హత్యలకు పాల్పడటం, దాడులకు కుట్ర పన్నడం వంటి ఎన్నో కేసులు ఆయనపై ఉన్నాయి.
Maoists
Jarkhand
Ranchi
Police
Naxals

More Telugu News