Ameerkhan: 'మహాభారతం'లో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కృష్ణుడా? కర్ణుడా?

  • కృష్ణుడు, కర్ణుడు పాత్రలంటే తనకెంతో ఇష్టమని గతంలో వెల్లడించిన 'పీకే' స్టార్
  • ప్రస్తుతం చేస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' పూర్తవగానే మొదలు 
  • ఈ భారీ ప్రాజెక్టుకు సహ నిర్మాతగా ముకేశ్ అంబానీ...!
బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు పోషించే నటుల్లో మొదట గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌దే. లగాన్, పీకే, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్...ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన విలక్షణ పాత్రలు చేసిన సినిమాల జాబితా పెరుగుతూనే పోతుంటుంది. తాజాగా ఓ వార్త బాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

అమీర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు స్వయంగా వెల్లడించకపోయినా... ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'మహాభారతం'లో ఆయన ఓ కీలక పాత్రను పోషించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి ఇతిహాసంలో తనకు నటించాలని ఉందని, ముఖ్యంగా కృష్ణుడు, కర్ణుడు పాత్రలంటే తనకెంతో ఇష్టమని గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియా ముఖంగా వ్యక్తం చేశారని 'ఆఫ్టర్ అవర్స్' కథనం పేర్కొంది.

ఆయన కృష్ణుడి పాత్రకే మొగ్గు చూపే అవకాశాలున్నాయనే మరో వార్త వినబడుతోంది. మరికొన్ని రోజులు ఆగితే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం తాను నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా షూటింగ్ పూర్తి కాగానే అమీర్ 'మహాభారతం'పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల ఓ వార్త వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడం గమనార్హం.
Ameerkhan
Mahabharatam
Bollywood
Mukesh Ambani
Dangal

More Telugu News