Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. బిల్లు ఇవ్వకుంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు!

  • ‘నో బిల్-ఫ్రీ ఫుడ్’ విధానానికి రైల్వే రూపకల్పన
  • బిల్లు ఇవ్వకుంటే ఆహారం ఉచితం
  • త్వరలోనే అమల్లోకి కొత్త పాలసీ

రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా భారతీయ రైల్వే సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేసే కేటరర్లకు ఇకపై ముకుతాడు పడనుంది. రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం, ఇతర తినుబండారాలు, టీ, కాఫీ, కూల్‌డ్రింకులకు సంబంధించి రసీదు ఇవ్వకుంటే బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈమేరకు రైల్వే నిబంధనలు రూపొందిస్తోంది. ‘నో బిల్-ఫ్రీ పుడ్’ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకు రావాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు.

ఈ వివరాలను ఐఆర్‌సీటీసీ ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచి ప్రయాణికులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టింది. ఇన్‌స్పెక్టర్లను రైళ్లలో నియమించి ప్రయాణికులకు కేటరర్లు రసీదులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రసీదులు ఇవ్వడానికి కేటరర్లు నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వానికి ఏడువేలకు పైగా ఫిర్యాదులు అందడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News