rajanikanth: 'కాలా' రిలీజ్ డేట్ పై స్పందించిన లైకా ప్రొడక్షన్స్

  • రజనీకాంత్ హీరోగా రూపొందిన 'కాలా'
  • మరోమారు డాన్ గా రజనీ 
  • నిర్మాతగా ధనుష్      

రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'కాలా' సినిమా రూపొందింది. రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్న ఈ సినిమాకి, ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు లైకా ప్రొడక్షన్స్ వారు చూసుకుంటున్నారు. తాజాగా వారు ట్విట్టర్ ద్వారా .. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై స్పందించారు.

ఈ సినిమాను ఫలానా రోజున విడుదల చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఇంతవరకూ మేము అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. రిలీజ్ డేట్ విషయంలో గానీ .. ఈ సినిమాకి సంబంధించిన మరే అనధికారిక స్టేట్మెంట్స్ తో గాని తమకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ వారు చేసిన ప్రకటనతో, ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చని తెలుస్తోంది.      

More Telugu News