rana: రానాకి కథ వినిపించిన కృష్ణవంశీ?

  • తెలుగు .. తమిళ సినిమాలతో బిజీగా రానా
  • విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యత 
  • ఆయన కోసం కథ రెడీ చేసిన కృష్ణవంశీ        

తెలుగు .. తమిళ భాషల్లో రానాకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ను నిలబెట్టుకుంటూ ఆయన ఈ రెండు భాషల్లోను విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రానాను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కృష్ణవంశీ ఒక లైన్ ను సిద్ధం చేసి ఆయనకి వినిపించాడని అంటున్నారు.

 పూర్తి కథను రెడీ చేసి చెప్పమని రానా అనడంతో, కొంతకాలంగా కృష్ణవంశీ ఈ కథపైనే కసరత్తు చేస్తూ వచ్చాడట. కథ తనకి ఓకే అనిపించడంతో ఇటీవల రానాను కలిసి, ఆయనకి వినిపించాడట. అయితే ఈ కథ విషయంలో రానా పెద్దగా ఆసక్తిని చూపలేదని సమాచారం. ఈ కథ పట్ల రానా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, కృష్ణవంశీ మార్పులు చేసి రానాను ఒప్పిస్తాడా? లేదంటే మరో హీరోతో సెట్స్ పైకి వెళతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.       

More Telugu News