Natasha Suri: 'బంగీ జంప్' చేస్తుండగా మాజీ మిస్ ఇండియాకి గాయాలు

  • ఇండోనేసియాలో దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన నటి
  • సాహసాలపై మక్కువతో బంగీ జంప్ చేసిన వైనం
  • తాడు తెగిపోవడంతో ప్రమాదం... ప్రస్తుతం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్-2006 విజేత, బాలీవుడ్ నటి, వ్యాఖ్యాత నటాషా సూరీ ప్రమాదానికి గురయింది. బంగీ జంప్ సాహసం చేస్తుండగా ఆమె ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇండోనేసియాలో ఓ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె ఈ సాహసాన్ని చేసిందని సమాచారం. నటాషాకు మామూలుగానే ప్రయాణాలన్నా, సాహసాలన్నా విపరీతమైన ఆసక్తి. అందుకే ఈ బంగీ జంప్ సాహసం ఆమె చేసినట్లు తెలుస్తోంది.

ఈ సాహసం చేస్తున్నప్పుడు తాడు కొద్దిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే కింద రాళ్లూరప్పలు లేకుండా నీరు మాత్రమే ఉండటం వల్ల ఆమె నేరుగా నీళ్లలో పడిందని, అందువల్ల స్వల్ప గాయాలతోనే ఆమె తప్పించుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం ఇండోనేసియాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 'ఇన్‌సైడ్ ఎడ్జ్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
Natasha Suri
Former Femina Miss India
Indonesia
Bollywood
Inside Edge
Bungee jump

More Telugu News