ఏపీ అంశంపై వెంకయ్య నాయుడితో కేంద్ర మంత్రుల కీలక చర్చ
- రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్‌లో సమావేశం
- ఏపీలో పెండింగ్‌లో ఉన్న కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలపై చర్చ
- హాజరైన కేంద్ర మంత్రులు జవదేకర్, అనంత కుమార్, ఎంపీలు కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి
- రెండు వర్సిటీలపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నాలు
న్యాయశాఖ వద్ద ఉన్న వర్సిటీ బిల్లులు పార్లమెంటుకు చేరేలా చూడాలని వెంకయ్య నాయుడు సూచించారు. పార్లమెంటులో పెండింగ్ కాకుండా చూడాలని అనంతకుమార్‌ను వెంకయ్య నాయుడు కోరారు. ఈ సందర్భంగా రెండు వర్సిటీలపై కేబినెట్ ఆమోదానికి చర్యలు తీసుకుంటున్నట్లు జవదేకర్ వెంకయ్య నాయుడికి తెలిపారు.