Donald Trump: ట్రంప్ తో అఫైర్ పై కోర్టుకెక్కిన ప్లేబాయ్ మాజీ మోడల్

  • రియాలిటీ షో అప్రెంటిస్ సమయంలో లైంగికంగా ట్రంప్ వేధించాడన్న సమ్మర్ జెరోస్
  • ట్రంప్ తో వివాహేతర సంబంధం ఉందని ప్రకటించిన స్టోర్మీ డేనియల్
  • పదినెలలు ట్రంప్ తో రహస్య సంబంధం నడిపానన్న ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ను వివాహేతర సంబంధాలు ఇబ్బంది పెడుతున్నాయి. మొన్నటికి మెన్న అప్రెంటిస్ షో కంటెస్టెంట్ సమ్మర్ జెరోస్ లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ట్రంప్ తీరును బట్టబయలు చేయగా, గత నెలలో పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్ ట్రంప్ తో వివాహేతర సంబంధం, అది బయటపడకుండా చేసుకున్న ఒప్పందం గురించి వెల్లడించి కలకలం రేపింది. తాజాగా 2006-07 మధ్యలో పది నెలల పాటు ట్రంప్ తో సాగిన రహస్య సంబంధంపై చేసుకున్న ఒప్పందం నుంచి బయటపడేయాలంటూ ప్లేబాయ్‌ మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్‌ లాస్‌ ఏంజిల్స్‌ సుపీరియర్‌ కోర్టులో దావా వేశారు.

ట్రంప్‌ తో ఎఫైర్‌ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్‌ ఎంక్వైరర్‌ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్‌ మీడియా ఇంక్‌ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ సంస్థ అధిపతి డేవిడ్‌ పెకర్‌ గతంలో ట్రంప్‌ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మెక్ డౌగల్-ట్రంప్ అఫైర్ కథనం ప్రచురించే హక్కులను కొనుగోలు చేశారని, దానిని ఇప్పటివరకు ప్రచురించలేదని, దానిపై నోరువిప్పేందుకు ఆ ఒప్పందం నుంచి బయటపడేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇప్పటికే ట్రంప్‌ ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం కేసులు ఎదుర్కొంటుండగా, మూడోకేసు ఆయనను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ మూడు కేసుల్లో రెండు కేసులు మెలానియా చిన్న కొడుకు బ్యారెన్ గర్భంలో ఉండగా చోటుచేసుకున్న సంబంధాల వల్లే కావడం విశేషం. పోర్న్ స్టార్, ప్లేబాయ్ మోడల్ తో ఒకే సారి ట్రంప్ నడిపిన వివాహేతర సంబంధాలు ఆయనను తలపట్టుకునేలా చేస్తున్నాయి. 
Donald Trump
extra maritual affaires
summer jeros
stormi danials
karen macdougal

More Telugu News