lakshmipathi: రాష్ట్ర ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన మరో బీజేపీ నేత!

  • బీజేపీ నేత లక్ష్మీపతి రాజీనామా
  • వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పని చేసిన లక్ష్మీపతి
  • పవన్, జగన్ వెనుక బీజేపీ లేదన్న నేత
ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి బీజేపీ నేత లక్ష్మీపతి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి, రాజీనామా లేఖను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలోనే, తాను ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. బీజేపీతో టీడీపీ సంబంధాలను తెంచుకున్నప్పుడు... పదవిలో తాను కొనసాగడం భావ్యం కాదని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసిందో... ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్, జగన్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. 
lakshmipathi
resignation
bjp

More Telugu News