Revanth Reddy: రాజకీయాలకు, కుట్రలకు వేదికగా మారిన రాజ్ భవన్: రేవంత్ రెడ్డి

  • గవర్నర్ నరసింహన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు
  • నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారు
  • మోదీ అజెండాను అమలు చేసేందుకు రాజ్ భవన్ ను వాడుకుంటున్నారు 
రాజకీయాలకు, కుట్రలకు వేదికగా రాజ్ భవన్ మారిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ అజెండాను అమలు చేసేందుకు రాజ్ భవన్ ను వాడుకుంటున్నారని, అందుకే, గవర్నర్ నరసింహన్ పదవీకాలం ముగిసినా ఆయన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోని నరసింహన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న మోదీ, కేసీఆర్ లకు వ్యతిరేకంగా తాము పోరాడతామని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేనందునే కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారని, నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారని ఇటీవల జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ ప్రస్తావించారు.
Revanth Reddy
Telangana
rajbhavan

More Telugu News