nokia smart phones: నోకియా వెబ్ సైట్ లోనూ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు

  • నోకియా డాట్ కామ్ నుంచి కొనుగోలుకు అవకాశం
  • ఫ్రీ షిప్పింగ్, పది రోజుల వరకు రిటర్న్ పాలసీ
  • ఫోన్లతో పాటు యాసెసరీల విక్రయం
నోకియా బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న హెచ్ ఎండీ గ్లోబల్ సంస్థ తన ఉత్పత్తులను సొంత వెబ్ సైట్ లోనూ అమ్మకాలను ప్రారంభించింది. నోకియా డాట్ కామ్ నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కస్టమర్లకు కల్పించింది. ఇప్పటి వరకు వీటిని వివిధ ఈ కామర్స్ వేదికలపైనే కొనుగోలుకు అవకాశం ఉండేది.

తన వెబ్ సైట్లో స్మార్ట్ ఫోన్లతో పాటు, ఫోన్ యాక్సెసరీలను కూడా అందుబాటులో ఉంచింది. అన్నింటిపైనా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ చేస్తోంది. సురక్షితమైన చెల్లింపులకు హామీ ఇస్తోంది. దీనికి అదనంగా 10 రోజుల పాటు రిటర్న్ పాలసీకి అనుమతిస్తోంది. ప్రస్తుతానికి అన్ని ఫోన్లు నోకియా డాట్ కామ్ లో విక్రయానికి లేవు. నోకియా2, 3, 5, 8 మోడళ్లతోపాటు, ఫీచర్ ఫోన్లు 3310, 216, 150 మోడళ్లను అందుబాటులో ఉంచింది.
nokia smart phones

More Telugu News