sasikala pushpa: మళ్లీ పెళ్లి చేసుకోనున్న తమిళనాడు ఎంపీ శశికళ పుష్ప.. వెడ్డింగ్ కార్డ్ వైరల్!

  • ఈనెల 26న ఢిల్లీలో వివాహం
  • రామస్వామిని పెళ్లాడబోతున్న శశికళ
  • లింగేశ్వర్ తో తొలి వివాహం
అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. రామస్వామి అనే వ్యక్తిని ఈమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి జయలలిత బతికున్న రోజుల్లో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ చెంపను శశికళ పగలగొట్టారు. దీంతో, పార్టీ నుంచి ఆమెను జయ బహిష్కరించారు. లింగేశ్వర్ తిలకన్ అనే వ్యక్తితో శశికళ తొలి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓరియంటల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ రామస్వామికి ఆమె దగ్గరయ్యారు. వీరి వివాహం 26వ తేదీన ఉదయం 9 గంటలకు జరగనుంది. ప్రస్తుతం శశికళ దినకరన్ వర్గ ఎంపీగా కొనసాగుతున్నారు.
sasikala pushpa
marriage

More Telugu News