mark zuckerberg: జుకర్ బెర్గ్ సంపదలో రూ.31,800 కోట్లు హరీ!

  • 5 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారం చోరీ
  • కేంబ్రిడ్జ్ అనలైటిక అనే ప్రకటనల కంపెనీ నిర్వాకం
  • దీంతో పడిపోయిన ఫేస్ బుక్ షేరు

4.9 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో ఏకంగా రూ.31,800 కోట్లకు సమానం) మేర ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ సంపద హరించుకుపోయింది. ప్రకటనలకు సంబంధించిన డేటా సంస్థ కేంబ్రిడ్జ్ అనలైటిక్ కోట్లాది మంది ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని ఓ యాప్ సాయంతో అనుమతి లేకుండా చోరీ చేసిందని స్వయంగా ఫేస్ బుక్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి సహకారం అందించినది ఈ ప్రకటనల సంస్థే. ఏకంగా 5 కోట్ల మంది యూజర్ల సమాచారం కొట్టేసింది. దీంతో ఫేస్ బుక్ షేరు 7 శాతం పతనమై 172.56 డాలర్లకు పడిపోయింది. ఫలితంగా జుకర్ బెర్గ్ సంపద 70.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.

More Telugu News