Chandrababu: చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టిన రోజు.. టీటీడీకి రూ.25 లక్షల విరాళం

  • రేపు లోకేశ్ కుమారుడు దేవాంశ్ పుట్టిన రోజు
  • నేటి సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబం
  • నిత్యాన్నదాన పథకానికి భూరి విరాళం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు అయిన నారా దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రూ.25 లక్షల విరాళం అందించాలని నిర్ణయించారు. బుధవారం డేవాంశ్ పుట్టిన రోజు కావడంతో నేటి సాయంత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడి పద్మావతి అతిథి గృహంలో బస చేసి బుధవారం ఉదయం వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం టీటీడీ నిత్యాన్నదాన పథకానికి రూ.25 లక్షల విరాళం అందించనున్నట్టు చంద్రబాబు కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Chandrababu
Nara Lokesh
Devansh
TTD

More Telugu News