Salman Khan: 'టీబీ'తో దయనీయ స్థితిలో సల్మాన్ హీరోయిన్.... సాయం కోసం ఎదురుచూపులు!

  • 1995లో విడుదలయిన సల్మాన్ ఖాన్ వీర్‌గతి చిత్రంలో నటించిన పూజా
  • ఆరు నెలల కిందట టీబీ సోకినట్లు వైద్యుల నిర్థారణ 
  • భర్త, కుటుంబసభ్యులు వదిలేశారని ఆవేదన, టీకి కూడా డబ్బులు లేవని కన్నీరు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ హీరోగా 1995లో రిలీజైన 'వీర్‌గతి' చిత్రంలో నటించిన హీరోయిన్ పూజా దడ్వాల్‌ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. తనకు టీబీ సోకిందని ఆరు నెలల కిందట వైద్యులు నిర్థారించారని, ఈ విషయం తెలియగానే తన భర్త, కుటుంబం తనను వదిలేశారని ఆమె వాపోయింది. గత పదిహేను రోజులుగా ముంబైలోని సెవ్రీలో ఉన్న టీబీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఒంటరిగా ఉన్న తనను ఆదుకునే వారు ఎవరూ లేరని, చికిత్స చేయించుకునే స్తోమత కూడా తనకు లేదని, సాయం కోసం సల్మాన్‌‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆమె తెలిపింది.

తన బాధ గురించి తెలిస్తే ఆయన సాయం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. చాలా ఏళ్లపాటు గోవాలో క్యాసినో నడిపానని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కనీసం ఓ కప్పు టీకి కూడా ఇతరులపై ఆధారపడుతున్నానని ఆమె తన దయనీయ స్థితి గురించి వివరించింది. వీర్‌గతి చిత్రంలో అతుల్ అగ్నిహోత్రి సరసన ఆమె నటించింది. అలాగే హిందూస్తాన్, దబ్‌దబా, సింధూర్ కి సౌగంధ్ చిత్రాల్లోనూ ఆమె యాక్ట్ చేసింది.
Salman Khan
Pooja Dadwal
Bollywood
Atul Agnihotri
Veergati

More Telugu News