mohammad shami: యూటర్న్ తీసుకున్న హసీన్ జహాన్... మ్యాచ్ ఫిక్సింగ్ అనలేదని వ్యాఖ్య

  • గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ కి షమీ పాల్పడ్డాడని ఆరోపించిన భార్య
  • బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విచారణలో మ్యాచ్ ఫిక్సింగ్ అనలేదని స్పష్టీకరణ
  • తనకు క్రికెట్ పై అవగాహన లేనప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎలా అంటానని ప్రశ్న

టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని తాను వ్యాఖ్యానించలేదని ఆయన భార్య హసిన్‌ జహాన్‌ తెలిపింది. బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల ముందు విచారణకు హాజరైన ఆమె.. తన భర్త ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడని తాను ఆరోపించానంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. ఇంగ్లండ్‌ కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌ కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త డబ్బులు తీసుకున్నాడని మాత్రమే తాను చెప్పానని ఆమె అన్నారు.

తనకు క్రికెట్ గురించి సరైన అవగాహన లేనప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎలా అంటానని ఆమె తెలిపింది. హసీన్ జహాన్ ఫోన్ ఆడియో టేపుల్లో భర్తతో నగదు గురించి గొడవపడుతున్నట్టు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక బీసీసీఐకి అధికారులు అందించనున్నారు. ఆ తరువాతే షమీ కెరీర్ పై సస్పెన్స్ వీడిపోతుందని తెలుస్తోంది.

More Telugu News