lalu prasad yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్

  • దాణా కుంభకోణం నాలుగో కేసులో తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు
  • లాలూను దోషిగా తేల్చిన కోర్టు
  • జగన్నాథ్ మిశ్రాకు ఊరట

దాణా కుంభకోణంలో ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఈ స్కాంకు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఇదే కేసులో మరో 30 మంది ప్రమేయం కూడా ఉన్నట్టు తేల్చింది. 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్య దుంబా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేసినట్టు రుజువైందని కోర్టు తెలిపింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.

మరోవైపు, రాంచీలోని బిశ్రా ముండా జైల్లో ఉన్న లాలూప్రసాద్ శనివారంనాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కోర్టుకు హాజరుకాలేకపోయారు.

More Telugu News