bread: దక్షిణ కొరియాలో బ్రెడ్ కొనాలంటే కష్టమే... ఢిల్లీతో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ ధర!

  • కిలో బ్రెడ్ ఢిల్లీలో సగటున ఒక డాలర్
  • సియోల్ లో మాత్రం 15.6 డాలర్లు
  • ప్రపంచవ్యాప్త జీవన వ్యయాలపై అధ్యయనంలో వెల్లడి

మన దగ్గర రూ.5 రూపాయలు పెట్టినా బ్రెడ్ దొరుకుతుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి లేదు. ముఖ్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో బ్రెడ్ కొనాలంటే ఆర్థిక సామర్థ్యం ఉండి తీరాల్సిందే. ఢిల్లీలో కిలో బ్రెడ్ సగటున (1.1 డాలర్) రూ. 70 పెట్టి కొనుగోలు చేయవచ్చు. కానీ సియోల్ లో దీనికి పదిహేను రెట్లు అధికంగా 15.6 డాలర్లు వెచ్చిస్తే గానీ కిలో బ్రెడ్ రాదు.

కిలో బ్రెడ్ జెనీవాలో 6.5 డాలర్లు, పారిస్ లో 6.3 డాలర్లు, ఓస్లోలో 5.5 డాలర్లు, జ్యురిచ్ లో 5.3 డాలర్లు, టెల్ అవీవ్ లో 5.1 డాలర్లు, హాంగ్ కాంగ్ లో 4.6 డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.

  • Loading...

More Telugu News