mobile number portability: కోరిన వెంటనే మొబైల్ నెట్ వర్క్ మార్చుకునే అవకాశం... త్వరలోనే!

  • ప్రస్తుతం పోర్టింగ్ కు ఏడు రోజుల సమయం
  • దీన్ని సాధ్యమైనంత తగ్గించాలనుకుంటున్న ట్రాయ్
  • అంతర్జాతీయంగా గంటల్లోనే పూర్తవుతున్న వైనం

మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ)... ఒక నెట్ వర్క్ పట్ల సంతృప్తిగా లేకపోయినా, మరో నెట్ వర్క్ లో ఆకర్షణీయమైన ఆఫర్లున్నా అదే నంబర్ తో కస్టమర్లు మారిపోయేందుకు వీలు కల్పించే సాధనం. ఇందుకు కస్టమర్ ముందుగా పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మొబైల్ నంబర్ టైప్ చేసి 1900 కు ఎస్ఎంఎస్ చేస్తే ఓ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను ఇవ్వడం ద్వారా మరో నెట్ వర్క్ కు మారిపోవచ్చు. ఇందుకు ఏడు రోజులు గరిష్టంగా తీసుకునే వ్యవధి. కానీ, ఇది చాలా ఎక్కువన్న విమర్శలు, ఫిర్యాదులు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టికి వచ్చాయి. దీంతో ఈ వ్యవధిని తగ్గించే చర్యలు మొదలు పెట్టింది.

ప్రస్తుతం అంతర్జాతీయంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ అన్నది గంటల వ్యవధిలోనే పూర్తయిపోతుంది. మన దగ్గర ఏడు రోజులుగా ఉండడంతో దీన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించాలన్నది ట్రాయ్ యోచన. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని ఈ నెల చివరిలోగా విడుదల చేయనున్నట్టు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. అలాగే, ఈ ప్రక్రియను సులభంగా మార్చనున్నట్టు చెప్పారు. సమీక్షలో భాగంగా ఎంఎన్ పీని వేగతరం చేయడంపై టెలికం కంపెనీల అభిప్రాయాలను కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకోనుంది.

  • Loading...

More Telugu News