arun dadupuri: బార్ డాన్సర్ తో రచ్చరచ్చ చేసిన ఆర్జేడీ నేత.. వైరల్ వీడియో చూడండి!

  • వివాహవేడుకకు హాజరైన ఆర్జేడీ నేత అరుణ్ దాదుపురి
  • బార్ డాన్సర్ తో హద్దు మీరి ప్రవర్తన
  • సోషల్ మీడియాలో వైరల్ 
బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని ఫతేపూర్ పెళ్లి వేడుకలో ఆర్జేడీ నేత ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆ పార్టీ నేతలను తలపట్టుకునేలా చేస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే... మార్చి 10వ తేదీన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కు చెందిన నేత అరుణ్ దాదుపురి ఫతేపూర్ లో ఒక వివాహానికి హాజరయ్యారు. ఆ వేడుకలో బంధువుల కోసం వధూవరుల కుటుంబ సభ్యులు బార్ డాన్సర్ తో డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇక ఆమె డాన్స్ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమె దగ్గరకు చేరుకుని, ఆమెతో చిందులేయడమే కాకుండా, ఆమెపై కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగని ఆయన.. ఆమెను అమాంతం ఎత్తుకొని డాన్స్ వేసే ప్రయత్నం చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ పరువు తీశాడని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బహిరంగ వేదికల్లో ప్రజాప్రతినిధులు గౌరవంగా మసలుకోవాలని హితవు పలుకుతున్నారు. ఆ వీడియోను చూడండి.   
arun dadupuri
bihar
rjd
politician
bad behaviour

More Telugu News