no confidence motion: బిగ్ మండే.. అవిశ్వాసానికి మద్దతుగా ఎంతమంది? వ్యతిరేకంగా ఎంతమంది?

  • వేడెక్కిన హస్తిన రాజకీయాలు
  • కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, వైసీపీ
  • అవిశ్వాసానికి వ్యతిరేకంగా 333 మంది ఎంపీలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు యుద్ధం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీయేలో బీజేపీకి సొంతంగానే భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. కాకపోతే, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అవిశ్వాసంపై చర్చ ఉపయోగపడుతుంది. 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరి బలాలు ఎంత ఉన్నాయనే వివరాలను చూద్దాం.

అవిశ్వాసానికి అనుకూలమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:
  • టీడీపీ - 16
  • వైసీపీ - 5
  • కాంగ్రెస్ - 48
  • టీఎంసీ - 34
  • వామపక్షాలు - 10
  • బీజేడీ - 20
  • ఇతరులు - 7
  • మొత్తం - 140

అవిశ్వాసానికి వ్యతరేకమైన పార్టీలు, ఎంపీల సంఖ్య:
  • బీజేపీ - 274
  • ఎల్జేపీ - 6
  • శిరోమణి అకాలీదళ్ - 4
  • జేడీయూ - 2
  • ఇతరులు - 47
  • మొత్తం - 333
no confidence motion
Telugudesam
YSRCP

More Telugu News