Chiranjeevi: 'రంగస్థలం' ఫంక్షన్ లో చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు!

  • ప్రత్యేక హోదాపై చిరంజీవి ప్రకటన చేయాలని డిమాండ్
  • విభజన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ఆగ్రహం
  • 'రంగస్థలం' ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఘటన
రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిన్న విశాఖపట్నంలో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవికి వ్యతిరేకంగా ఏయూ విద్యార్థి సంఘం నిరసన వ్యక్తం చేసింది. పలు విద్యార్థి సంఘాలతో కలసి యూనివర్శిటీ విద్యార్థులు ప్రీరిలీజ్ వేడుక వద్ద ధర్నా చేశారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విభజన హామీల కోసం చిరంజీవి ఎందుకు పోరాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిరంజీవి ప్రకటన చేయాలని... లేకపోతే ప్రజా ఉద్యమంలోనైనా పాలుపంచుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కల్పించుకుని, పరిస్థితిని చక్కదిద్దారు.
Chiranjeevi
rangasthalam movie
ou students
union
protest

More Telugu News