Chandrababu: ఎందుకింత భూమి? అని నన్ను అడుగుతారా?: పవన్ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు

  • ఏ నగరమూ ఆకాశంలో నిర్మితమవదు
  • అమరావతికి భవిష్యత్ ఇబ్బందులు వద్దనే సమీకరణ
  • రైతులు వారంతట వారే ఇచ్చారన్న చంద్రబాబు

కొంతమంది వ్యక్తులు రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకోకుండా, ఇంత భూమి ఎందుకని తనను ప్రశ్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ నగర నిర్మాణమూ ఆకాశంలో జరగలేదని, అన్ని రకాలుగా అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకూడదనే తాను స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని రైతులను కోరితే, వారంతట వారే ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు.

తాను ఇప్పటికే అసెంబ్లీ, సెక్రటేరియేట్ కట్టానని, హైకోర్టు వంటి ఇంకొన్ని భవనాలు కట్టేస్తే సరిపోతుందని... అసలు రాజధాని అంటే నాలుగు భవనాలేనా? అని ఆలోచించి చూడాలని అన్నారు. రాజధానంటే ఇది కాదని, ప్రజలు వచ్చి ఉండాలని, మౌలిక వసతులు కావాలని, నాణ్యమైన, విశాలమైన రోడ్లు ఉండాలని చెప్పారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, మహారాష్ట్రకు ముంబై ఉన్నట్టే తెలుగువారికో నగరం ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. అందుకే ఎంతమంది ఎన్ని మాట్లాడినా తాను బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలనే కృత నిశ్చయంతో ఉన్నానని అన్నారు.

More Telugu News