Botsa Satyanarayana: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాం: బొత్స సత్యనారాయణ

  • పవన్ నిరాహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నది చంద్రబాబు ఆందోళన 
  • హోదా ఎవరి ద్వారా వస్తే ఏంటీ?
  • రాష్ట్రానికి మేలు జరిగితే సంతోషించాలి కదా?
  • టీడీపీ నేతలు కేసులు, కమీషన్ల కోసం విభజన హామీల సాధనలో రాజీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హోదా ఎవరి ద్వారా వస్తే ఏంటని, రాష్ట్రానికి మేలు జరిగితే సంతోషించాలి కదా? అని ఆయన హితవు పలికారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలు కేసులు, కమీషన్ల కోసం విభజన హామీల సాధనలో రాజీ పడ్డారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితోనైనా కలుస్తామని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని, దాని కోసం తమ పార్టీ నిరంతరాయంగా పోరాడుతోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోసం దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో తమ పార్టీ నేతలు ఇప్పటికే మాట్లాడారన్నారు.
Botsa Satyanarayana
Special Category Status
Andhra Pradesh
YSRCP

More Telugu News