Pawan Kalyan: ప్రత్యేక హోదా పోరాటంపై ఎలా ముందుకు వెళదాం?.. న్యాయవాదులతో పవన్ కల్యాణ్ చర్చ

  • పవన్‌ను కలిసిన పలువురు న్యాయవాదులు
  • జనసేనకు అన్ని రకాలుగా న్యాయపరమైన సాయం అందిస్తామని హామీ 
  • జనసేన లీగల్ సెల్‌ ఏర్పాటు
  • మరోవైపు పవన్‌ను కలిసిన రైతులు
అమరావతికి చెందిన పలువురు న్యాయవాదులు ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. విజయవాడలోని జనసేన తాత్కాలిక కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ప్రత్యేకహోదాపై పోరాటంలో జనసేన పార్టీకి అన్ని రకాలుగా న్యాయపరమైన సాయం అందిస్తామని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.. దానికి అంబేద్కర్ లీగల్ సెల్‌గా నామకరణం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు న్యాయపరంగా ఏ రకమైన పోరాటం చేయొచ్చు? చట్టంలో ఉన్న అవకాశాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించాలని పవన్ కల్యాణ్ లీగల్ సెల్ ప్రతినిధులకు సూచించారు.  

రేపు ఉద్దండ రాయునిపాలెం వెళ్లనున్న పవన్..


మరోవైపు, రైతుల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు గుంటూరు జిల్లాలోని ఉద్దండ రాయునిపాలెం వెళ్లనున్నారు. తుళ్లూరు, ఉద్దండ రాయునిపాలెం ఎస్సీ రైతులు.. ఈ రోజు విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం అందలేదని పవన్ కు తెలిపారు. వారితో కాసేపు మాట్లాడిన పవన్ కల్యాణ్.. రేపు ఉదయం ఉద్దండరాయుని పాలెం వచ్చి సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటానని తెలిపారు.


Pawan Kalyan
Special Category Status
Andhra Pradesh
Jana Sena

More Telugu News