Undavalli: అది జరగకపోతే చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది: ఉండవల్లి

  • అవిశ్వాసంపై చర్చ జరిగేలా చంద్రబాబు ప్రయత్నించాలి
  • ఆయన ఇమేజ్ ను ఉపయోగించడానికి ఇదే సరైన సమయం
  • బీజేపీతో పవన్ కల్యాణ్ కుమ్మక్కు కాలేదు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాయని చెప్పారు. అవిశ్వాసం చంద్రబాబుకు పెద్ద పరీక్ష అని... ఆయన పట్టుదలగా వ్యవహరిస్తే అవిశ్వాసంపై చర్చ సాధ్యమేనని అన్నారు.

పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరగకపోతే... చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు. తనకున్న ఇమేజ్ ను ఉపయోగించుకోవడానికి చంద్రబాబుకు ఇదే సరైన సమయమని అన్నారు. అవిశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా... ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని తెలిపారు. బీజేపీతో పవన్ కుమ్మక్కయ్యారనేది అవాస్తవమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పవన్ నిరాహారదీక్ష చేపడితే... మంచి ప్రచారం వస్తుందని తెలిపారు. 

More Telugu News