debit card: క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి 2017లో 1,700కు పైగా మోసాలు

  • రూ.71.48 కోట్లను నష్టపోయిన కస్టమర్లు
  • డిసెంబర్ లో ఎక్కువ మోసాలు
  • ఆర్ బీఐ నివారణ చర్యలు చేపడుతోంది
  • పార్లమెంటుకు వెల్లడించిన కేంద్రం

2017 సంవత్సరంలో వినియోగదారులు రూ.71.48 కోట్ల మేర మోసపోయారు. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 1,700కుపైగా మోసాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ పార్లమెంటుకు తెలియజేశారు. ఈ కేసుల్లో జరిగిన మొత్తం నష్టం విలువ రూ.71.48 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఇవన్నీ కూడా రూ.లక్ష ఆపైన విలువ కలిగిన మోసాలే. ఆలోపు విలువ కలిగినవి వేరే.

ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో మోసాలు ఎక్కువగా జరిగాయి. ఆ నెలలో ఏటీఎం, పీవోఎస్ మెషిన్ల ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.3.46 లక్షల కోట్లుగా ఉంది. ఆన్ లైన్ చెల్లింపుల్లో రిస్క్ ను పరిమితం చేసేందుకు ఆర్ బీఐ ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి పార్లమెంటుకు వివరించారు. అలాగే, 30,222 ఫిషింగ్, విషింగ్, ఓటీపీ చోరీ, సమాచార తస్కరణ ఘటనలు గతేడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో జరిగినట్టు చెప్పారు.

More Telugu News