milk packet: పాల ప్యాకెట్, పెట్ బాటిల్ పై మహారాష్ట్రలో పన్ను... వాడిన తర్వాత వెనక్కిస్తే తిరిగి చెల్లింపు

  • పాల ప్యాకెట్ పై అర్ధరూపాయి
  • పెట్ బాటిల్ పై రూపాయి లెవీ
  • మహారాష్ట్రలో కొత్త చట్టం

పర్యావరణ పరిరక్షణ దిశగా మహారాష్ట్ర సర్కారు వినూత్న నిర్ణయం తీసుకుంది. పాల ప్యాకెట్లు వినియోగించే వారి నుంచి, పెట్ బాటిల్స్ (కూల్ డ్రింక్స్, వాటార్ బాటిల్స్) వాడే వారి నుంచి కొంత మేర పన్ను రాబట్టాలని నిర్ణయించింది. దీంతో ప్రతీ పాల ప్యాకెట్ పై అర్ధ రూపాయి, పెట్ బాటిల్ పై రూపాయి మేర చెల్లించాల్సి వస్తుంది. ఎంఆర్పీపై అదనంగా ఈ మేరకు వసూలు చేస్తారు. అయితే, వాడిన తర్వాత ఎక్కడో పడేయకుండా బాధ్యతగా తీసుకొచ్చి తిరిగి అప్పజెబితే ఆ మేరకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇది తిరిగి చెల్లించబడే పన్ను అన్నమాట.

మరోవైపు కంపెనీలపైనా ఇదే విధమైన పన్ను వేయాలనే యోచనతో అక్కడి ప్రభుత్వం ఉంది. తిరిగి చెల్లించే రీసైకిల్ (తిరిగి వినియోగానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ) లెవీ విధించాలనుకుంటోంది. కంపెనీలు తొలుత పన్ను చెల్లించి, తాము తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ ను వినియోగం తర్వాత రీసైకిల్ చేయాలి. దాంతో వారు చెల్లించిన పన్నును ప్రభుత్వం తిరిగిస్తుంది.

More Telugu News