kalyan ram: తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న కల్యాణ్ రామ్

  • గతంలో మోచేతికి గాయం
  • లెక్క చేయకుండా షూటింగ్స్ తో బిజీ
  • తిరగబెట్టిన నొప్పి
టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. గతంలో ఆయన మోచేతికి గాయమైంది. రెస్ట్ తీసుకోవాలని అప్పట్లో డాక్టర్లు ఆయనకు సూచించారు. అయినా, వైద్యుల మాట వినకుండా ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నాడు. తాజా మూవీ షూటింగ్ లో ఆయనకు మోచేతి నొప్పి మళ్లీ తిరగబెట్టింది. సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో నొప్పిని భరిస్తూనే, షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో, ఆయనకు నొప్పి మరింత తీవ్రతరమైంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ వైద్య చికిత్స పొందుతున్నాడు. 
kalyan ram
injury
Tollywood

More Telugu News