namaz: ఈ తొమ్మిది మసీదులను హిందువులకు అప్పగించండి.. అక్కడ నమాజ్ వద్దు: ముస్లిం పర్సనల్ లా బోర్డుకు షియా వక్ఫ్ బోర్డు లేఖ

  • హిందూ దేవాలయాలను నాశనం చేసి మసీదులు నిర్మించారు
  • వీటికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి
  • ఇలాంటి ప్రాంతాల్లో ప్రార్థనలను ఖురాన్ అంగీకరించదు

మతపరమైన వివాదాస్పద ప్రాంతాల్లో ముస్లింలు నమాజ్ చేయకుండా ఆపాలంటూ అఖిల భారతీయ ముస్లిం పర్సనల్ లా బోర్డుకు యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చీఫ్ వసీం రిజ్వీ సూచించారు. ఈ మేరకు పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ మౌలానా రబీ హసన్ నద్వీకి లేఖ రాశారు. దేశంలో మొత్తం తొమ్మిది వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయని... వాటిలో నాలుగు యూపీలో, రెండు గుజరాత్ లో, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లలో ఒక్కోటి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇవన్నీ వివాదాస్పద స్థలాలు కావడం వల్ల... ఇక్కడ ముస్లింలు నమాజ్ చేయకుండా నియంత్రించాలని కోరారు. హిందూ ఆలయాలకు సంబంధించిన ఈ స్థలాల్లో ముస్లిం రాజులు బలవంతంగా మసీదులను నిర్మించారనే బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

ఇతర మతాలకు చెందిన స్థలాలను ఆక్రమించుకోవడం, నాశనం చేయడం, అక్కడ మసీదులను నిర్మించడంలాంటి వాటిని ఇస్లామిక్ చట్టాలు అనుమతించవని రిజ్వీ తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో చేసే ప్రార్థనలను ఖురాన్, షరియాలు అంగీకరించవని చెప్పారు. అయోధ్యలోని రామమందిర ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలంటూ గతంలోనే రిజ్వీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయోధ్య సహా వివాదాస్పదమైన ఈ తొమ్మిది స్థలాలను హిందువులకు అప్పజెప్పాలని తాజా లేఖలో ఆయన కోరారు.

More Telugu News