srivishnu: మనసుకు హత్తుకుంటోన్న 'నీది నాది ఒకే కథ' ట్రైలర్

  • శ్రీవిష్ణు హీరోగా 'నీది నాది ఒకే కథ'
  • కథానాయికగా 'బిచ్చగాడు' ఫేమ్ 
  • ఈ నెల 23వ తేదీన విడుదల      

శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల 'నీది నాది ఒకే కథ' సినిమాను సిద్ధం చేశాడు. 'బిచ్చగాడు' ఫేమ్ సట్నా టైటస్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ కట్ చేశారు.

 కొన్ని డైలాగ్స్ నవ్వించేలా ఉంటే .. మరికొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా .. మనసుకు పట్టేసేవిగా వున్నాయి. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు మనసును తడి చేసేవిగా .. హృదయానికి హత్తుకునేవిలా వున్నాయి. ఈ సినిమా .. శ్రీ విష్ణు నటనకు ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

  • Loading...

More Telugu News