epfo: ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త... త్వరలోనే కనీస పింఛను రూ.2,000!

  • త్వరలో నిర్ణయం
  • 40 లక్షల మందికి ప్రయోజనం
  • కేంద్రంపై రూ.3,000 కోట్ల భారం
  • ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడి

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న వారికి త్వరలో తీపి కబురు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలవారీ కనీస పింఛను రూ.1,000 ఉంది. దీన్ని మోదీ సర్కారు రూ.2,000 చేయనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీనివల్ల 40 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.3,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కనీసం రూ.1,000 పింఛను ఇవ్వడం వల్ల ఈపీఎఫ్ వో సంస్థకు ఏర్పడుతున్న లోటును కేంద్రం పూడుస్తోంది. పెన్షన్ ను రెట్టింపు చేస్తే మరింత అధికంగా నిధుల భారాన్ని మోయాల్సి వస్తుంది. వాస్తవానికి కనీస పింఛనును రూ.3,000 నుంచి రూ.7,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాల నుంచి కేంద్రంపై ఒత్తిళ్లు ఉన్నాయి.

More Telugu News