Lok Sabha: సభ జరిగే పరిస్థితి లేదంటూ... లోక్ సభను సోమవారానికి వాయిదా వేసిన స్పీకర్

  • సమావేశాలను అడ్డుకున్న విపక్ష ఎంపీలు
  • ముందుకు సాగని ప్రశ్నోత్తరాల కార్యక్రమం
  • స్పీకర్ విన్నపాలను పట్టించుకోని ఎంపీలు

నేటి పార్లమెంట్ సమావేశాలు విపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో, ఆందోళనలతో అట్టుడుకాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు వివిధ సమస్యలపై లోక్ సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయగా, టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేశారు.

 ఈ నేపథ్యంలో, పశ్నోత్తరాల కార్యక్రమం ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు విన్నవించినప్పటికీ... పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేశారు. సభను కొనసాగించలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

More Telugu News