Chandrababu: టీడీపీ అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు.. అందరూ ఏకమవుదామంటూ దీదీ పిలుపు!

  • చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన మమత
  • విపక్షాలన్నీ ఏకం కావాలంటూ పిలుపు
  • వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పెరుగుతోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మోదీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు పార్టీలు టీడీపీ తీర్మానానికి మద్దతు పలికాయి. మధ్యాహ్నంలోగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని శివసేన ప్రకటించింది. అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో, జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Chandrababu
mamatha banerjee
no confidence motion

More Telugu News