No confidence Motion: చకచకా దూసుకెళుతున్న టీడీపీ... లోక్ సభ కార్యదర్శికి సొంతంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీలు

  • నోటీసుపై 16 మంది సంతకాలు చేశారు
  • ఏపీ ప్రభుత్వంపై బీజేపీ కక్ష సాధింపు
  • ఇతర పార్టీల మద్దతు తీసుకొస్తాం
ఈ ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్ సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితం అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆపై మీడియాతో మాట్లాడిన తోట నరసింహం, ఆంధ్రప్రదేశ్ పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ అధినేత అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని తోట నరసింహం వ్యాఖ్యానించారు. 
No confidence Motion
Telugudesam
Chandrababu
Andhra Pradesh
Tota Narasimham

More Telugu News