Chandrababu: ఐదుగురితో మనం వెళ్లేదేంటి? వైసీపీ అవిశ్వాసానికి మద్దతుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • మనకు 16 మంది సభ్యుల బలముంది
  • అవినీతిలో కూరుకుపోయిన పార్టీ వెంట వద్దని ప్రజలు అంటున్నారు
  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పలు పార్టీల సానుభూతి
  • అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న చంద్రబాబు
కేవలం ఐదుగురు సభ్యులు సంతకాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచే బదులు, 16 మంది సభ్యుల బలమున్న తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ ఎంపీల ముందు చంద్రబాబు వ్యక్తం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన వైకాపా వెంట వెళితే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, అక్రమాస్తుల కేసులో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి పార్టీ వెంట టీడీపీ వెళ్లకూడదని ప్రజలు కూడా భావిస్తున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పలు ప్రాంతీయ పార్టీలు సానుభూతితో ఉన్నాయని, వారిలో అత్యధికులు నేడు కలిసొస్తారని తాను భావిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఇతర పార్టీల మద్దతు కోసం తాను స్వయంగా పార్టీల నేతలతో మాట్లాడుతానని, ఏపీకి ఏ విధంగానైనా న్యాయం జరగాలన్నదే తన కోరికని ఆయన తెలిపారు.
Chandrababu
No Confidence Motion
Telugudesam
YSRCP

More Telugu News